ప్రమాదవశాత్తు వాగులో కొట్టకపోయిన వ్యక్తి మృతి చెందిన సంఘటన పాల్వంచ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.. స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బంగారు జాల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్న సురేష్ అనే వ్యక్తి ముర్రేడు వాగు దాటుతుండగా వరద ఉధృతి కొట్టుకుపోయాడు.పట్టణలోని శ్రీనివాస కాలనీ బ్రిడ్జి సమీపంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి ప్రాథమిక విచారణ చేపట్టి శెవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానిక గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది