అక్కయ్యపాలెంలోని వినాయకపందిరిలో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో పదహారేళ్ల కుర్రాడిపై ఇనుప రాడ్తో దాడిచేశారు. ఈ సంఘటనపై బాలుడి బం ధువులు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా.. అక్కయ్యపాలెం రామకృష్ణా నగర్ లో స్థానిక యువకులు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.రాత్రి పందిరిలో పడుకునేందుకు వినయ్ అనే బాలుడు అక్కడికి వచ్చాడు. రాత్రి నిద్రించే సమయంలో పం దిరి ఎదురుగా మద్యం తాగుతున్న విఘ్నేశ్వర -రావు, అతడి సోదరుడు వినయ్ గొడవపడి ఇనుప రాడ్ దాడి చేశారు. తీవ్ర రక్తస్రావమై కిం ద పడిపోయిన వినయ్ను స్థానికులు, కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తీసుకెళ్లి చికిత్స చేయించారు.