కామారెడ్డిలోని జీఆర్ కాలనీలో బుధవారం వరద బీభత్సం సృష్టిస్తోంది. కాలనీ మొత్తం వరదనీటితో మునిగిపోయింది. పాత జాతీయ రహదారి వెంట వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా వరద ఉదృతంగా కొనసాగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం జరగడంతో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద నీరు నిలిచిపోవడంతో పలువురు చిక్కుకుపోయారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఆందోళనలో ఉన్న మహిళలు, పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు.