రైతులకు సరిపడా యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోస పెడుతున్నాయని మాజీ సుడా డైరెక్టర్, బీఆర్ఎస్ నేత మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత కెసిఆర్ ప్రభుత్వంలో ముందు చూపుతో వేసవికాలంలోనే రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచుకునే పరిస్థితి ఉండేది అన్నారు. ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. యూరియా కోసం ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే సీ