ఆత్మకూరు పట్టణంలోని శివా ట్రేడర్స్, మన గ్రోమోర్ సెంటర్ ఎరువుల దుకాణాలు మండల తహసిల్దార్ గారు రత్న రాధిక మరియు వ్యవసాయ అధికారి హేమలత గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణంలోని స్టాక్ రిజిస్టర్ మరియు బిల్ బుక్ లను పరిశీలించారు. రైతులకు అధిక ధరలకు ఎరులను అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ఎరువుల గోడౌన్ పరిశీలించడం జరిగింది. అనుమతి లేని ఎరువులను విక్రయించినచో లైసెన్సులు రద్దు చేయబడునని తెలియజేశారు.