దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి యూరియా కొరత లేదని మాట దాటేస్తున్నారని, రైతులు రోడ్డుపై నిలబడాల్సి వస్తోందని నియోజకవర్గ బిఎస్పీ ఇన్చార్జ్ బసిరెడ్డి సంతోష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులతో మాట్లాడుతూ, యూరియా సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని, పెద్ద రైతులకు యూరియా అందుతోందని, కానీ చిన్న, సన్నకారు రైతులు యూరియా కోసం ధర్నా చేస్తున్నారని, ఈ సమస్యను ఎమ్మెల్యే గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు