యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మండలంలోని కొయ్యలగూడెం, ధర్మోజి గూడెం, పీపల్ పహాడ్, దేవులమ్మ నాగారం, పంతంగి, ఆరెగూడెం, కాట్రేవ్ వంటి పలు గ్రామాలను మేఘాలు కమ్మేశాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.