నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, మూలతండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కార్చిచ్చు అంటుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 70 ఎకరాలలో మంటలు వ్యాపించి అడవి తగలబడుతుందని, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.