వ్యవసాయ పనులకు ఉపయోగించే దమ్ము చక్రాల ట్రాక్టర్లను రోడ్లపై తీసుకు వెళితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామ రెడ్డి హెచ్చరించారు. ఈ తరహా ట్రాక్టర్ల పై శుక్రవారం సాయంత్రం రవాణా శాఖ అధికారులు నగరం ప్రాంతంలో దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్లకు అపరాధ రుసుం విధించారు.దమ్ము చక్రాల ట్రాక్టర్లను రోడ్లపై తీసుకు వెళితే రహదారులు దెబ్బతింటున్నాయన్నారు.అందువల్ల ట్రాక్టర్లు ఉపయోగించే రైతులు పొలాల వద్ద మాత్రమే ట్రాక్టర్లకు దమ్ము చక్రాలు బిగించాలని ఆయన ఆదేశించారు.