సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన, ఉప ఆలయాలను ఆలయ అధికారులు మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆలయ అధికారులు, అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేసి తిరిగి సోమవారం ఉదయం 3-30 గంటలకు సంప్రోక్షణ చేసి సుప్రభాత సేవతో పాటు బిందెతీర్థం, బాల భోగం, నిజాభిషేకం, సహస్రనామార్చన కైంకర్యాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 8-30 గంటలకు భక్తులకు సర్వదర్శనాలకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు.