మహబూబాబాద్ జిల్లాలో అజాగ్రత్తగా కారు నడిపి లేగ దూడ మృతికి కారణమైన కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ మహేందర్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 1:00 లకు వెల్లడించారు.. పట్టణంలోని నెహ్రు సెంటర్ సమీపంలో రోడ్డుపైన ఒక లేగ దూడ ఉండగా శ్రీనివాస సెంటర్ నుండి నెహ్రూ సెంటర్ వైపునకు వస్తున్న కారు డ్రైవర్ తన వాహనాన్ని జాగ్రత్తగా నడిపి రోడ్డుపై ఉన్న దూడను ఢీకొట్టగా బలమైన గాయాలై ఆ దూడ అక్కడే మరణించింది. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ నరేష్ అనే వ్యక్తి పై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.