యూరియా కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరుబాటలో భాగంగా ఈ నెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. ఆదివారం తణుకు వైసిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.