కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం పూర్తిగా అతలాకుతలమైన విషయం తెలిసిందే గత 3 రోజులుగా రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం వర్షం నుండి కాస్త ఉపశమనం లభించింది అయితే పట్టణంలోని ఈఎస్ఆర్ గార్డెన్ వరకు కూలిన డివైడర్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోవడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో అధికారులు రోడ్డు పనుల చర్యలు ముమ్మరం చేస్తున్నారు.అలాగే కామారెడ్డి లింగయ్య పల్లి మధ్య రహదారి తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పరిస్థితిని గమనించిన ఆర్ అండ్ బి అధికారులు చర్యలు ప్రారంభించారు.