బైరెడ్డిపల్లి: మండలంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబానికి పార్టీ తరపున అందిన ప్రమాద భీమా చెక్కును పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి బాధిత కుటుంబీకులకు అందజేశారు. బైరెడ్డిపల్లి మండలం లక్కన పల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఎం.హరి జూన్ 6న గంగవరం మండలంలోని ఆలకుప్పం నుంచి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు.