తుఫాన్ వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40,000 నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆందోళన చేశారు.. సిపిఐ(ఎం ఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు పాములపాడు మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు..అనంతరం తహసిల్దార్ సుభద్రమ్మ కు సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. అనంతరం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల రైతులు మొక్కజొన్న, పత్తి, మిరప, ఉల్లి, సోయాబీన్ తదితర పంటలు నష్టపోవడం జరిగిందన్నారు. దీనికి తోడు వరదరాజ స్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భవనాశి వాగు పొంగి ఇస్కాల, చెలిమిల్ల ,లింగాల, పొలాలు నష్టపోయాయి అన్నారు.