గూడెం కొత్తవీధి మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఎక్కడికక్కడ వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మొండిగెడ్డ పంచాయతీ గింజంగి గ్రామంలో వరద నీరు పోటెత్తింది. గ్రామానికి చెందిన పలువురు రైతుల పొలాల మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటి ఉధృతికి పలుచోట్ల పంట పొలాలు కొట్టుకుపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా వస్తున్న తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.