గణేశ్ మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిందని బాపట్ల విద్యుత్ శాఖ ఏఈ సాయి శ్రీనివాస్ చెప్పారు. బుధవారం వినాయక చవితి పురస్కరించుకొని బాపట్లలో 15వ వార్డు నర్రా వారి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద విద్యుత్ శాఖ వారు ఉచిత విద్యుత్ మీటర్ ఏర్పాటు చేశారు. మండపం నిర్వాహకులు ఉచిత విద్యుత్ కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మీటర్లు బిగించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.