అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల రావికమతం మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజనులు విద్యుత్ అధికారుల తీరును నిరసిస్తూ శనివారం ఏఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డోలవానిపాలెం, పాత కొట్నాబెల్లి గ్రామాలకు చెందిన 20 ఆదివాసీ కుటుంబాల ఇళ్లకు విద్యుత్ అధికారులు మీటర్లు, వైర్లు కట్ చేశారని బాధితులు తెలిపారు. రాత్రి వేళలో చంటి పిల్లలతో, జ్వరంతో బాధపడుతున్న తమకు దయ లేకుండా కరెంటు కనెక్షన్ కట్ చేయడం అన్యాయమని వారు ఆరోపించారు.