అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని బుగ్గ సంగాల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అంజన్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలంలోని బుగ్గ సంగాల గ్రామానికి చెందిన అంజన్ రెడ్డి గత కొన్ని నెలలుగా కుటుంబసమస్యలతో పాటుగా అనారోగ్యసమస్యలతో బాధ పడుతుండే వాడు. పలు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న వ్యాధి నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అంజన్ రెడ్డి బుధవారం వేకువజామున ఇంటి పైకప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు కిందకు దించి చూడగా అతడు అప్పటికే మృతి చెంది ఉన్నాడు.