శ్రీశైలం మండలం సున్నిపెంట, లింగాలగట్టు పరిధిలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సీఐ చంద్రబాబు అన్నారు.శ్రీశైలం మండల తహశీల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన మంగళవారం అన్ని మతాల పెద్దలు, గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, నిబంధనలకు లోబడి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.