సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలోని రైతు వేదిక యార్డ్ వద్ద యూరియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే రైతులు చెప్పులు లైన్లో పెట్టి గంటల తరబడి వేచి ఉన్న పరిస్థితి కనిపించింది . గంటల తరబడి నిలబడలేక ఓపిక లేక వృద్ధులు, మహిళలు పాదరక్షలను క్యూ లైన్ లో పెట్టారు. తమ వంతు కోసం ఎదురు చూశారు. రైతులు తమ పొలం పనులు వదిలిపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూస్తున్నారు. అటు పొలం పనులు కాక.. ఇటు యూరియా బస్తాలు దొరకక ఆవేదన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్