అంకిశెట్టిపల్లె వైసీపీ సర్పంచి శరత్ రెడ్డి చెక్ పవర్ రద్దు అంకిశెట్టిపల్లి గ్రామ వైసిపి సర్పంచి శరత్ రెడ్డి చెక్ పవర్ ను అధికారులు రద్దు చేశారు. అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లి గ్రామ వైసీపీ సర్పంచిగా పనిచేస్తున్న శరత్ రెడ్డి పై అవినీతి అక్రమాలు, రెండేళ్ల వ్యవధిలో రూ.22 లక్షల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డట్లు జిల్లా డిపిఓ రాధా ఇతర అధికారుల విచారణలో తేలడంతో అతని చెక్ పవర్ ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రద్దుచేశారు. సర్పంచి శరత్ రెడ్డి తన పదవీ కాలంలో ప్రభుత్వ స్థలాలు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.