సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం శుక్రవారం రైతుల ధర్నా చేపట్టారు. అగ్రికల్చర్ అధికారుల కాళ్లు మొక్కుతూ మాకు యూరియా ఇవ్వండి అని వేడుకున్నారు. గజ్వేల్ పట్టణంలోని శ్రీ సాయి ఫర్టిలైజర్ యజమానితో టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనే నినాదాలతో ధర్నా చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కూడా, రైతులు మాకు యూరియా అందే వరకు మేము ఇక్కడి నుండి వెళ్లేది లేదని భీష్మించుకొని ధర్నాలో కూర్చున్నారు.