కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, బంగారు బాల్యం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహార వినియోగంపై బాలికలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కలిగే అనర్ధాలను బాలికలకు మున్సిపల్ చైర్మన్ వివరించారు. ప్రతిరోజు ఆహారంలో కోడిగుడ్లు, ఆకుకూరలు ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు.