జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,చెప్యాల గ్రామంలో ద్విచక్ర వాహనదారుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన గురువారం 9:50 pm కి చోటుచేసుకుంది,నల్లగొండ గ్రామానికి చెందిన కనకయ్య అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై కొడిమ్యాల నుండి స్వగ్రామానికి వెళ్తుండగా,వేములవాడ నుండి జగిత్యాల వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం చెప్యాల గ్రామ శివారు వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి వెళ్ళింది దీంతో ద్విచక్ర వాహనదారుడు కనకయ్యకు 2 కాళ్లు విరిగి తలకు ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి, అచేతన స్థితిలో పడిపోయిన కనకయ్యను స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో చికిత్సకు ఆసుపత్రికి తరలించారు,