రేపల్లె మండలం మోర్తోట గ్రామానికి చెందిన డొక్కు చిన్న వీరయ్య ఈనెల 29వ తేదీ ఉదయం గొర్రెల మేపేందుకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వీరయ్య కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రేపల్లె తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు, పట్టణ సీఐ మల్లికార్జునరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. చిన్న వీరయ్య రేపల్లె రూరల్ మండలం లంకెవానిదిబ్బ గ్రామంలో ఉన్నట్లు ఆచూకీ తెలియడంతో అతన్ని స్వగ్రామమైన మోర్తోట కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.