రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రెండవ రోజు (శుక్రవారం) గణేష్ నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు మండప నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా యువతి,యువకుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. గురువారం సాయంత్రం గణేష్ మధ్య వేడుకలను ఎస్పీ మహేష్ బి.గీతే,కలెక్టర్ సందీప్ కుమార్ ఝ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించి పర్యవేక్షించారు. పోలీస్,మున్సిపల్,రెవెన్యూ,ఫిషరీస్ సంబంధిత అధికారులు సమన్వయంతో నిమర్జనాలు కొనసాగుతున్నాయి.