ఆత్మకూర్ ఎస్ లో భారత సైన్యానికి మద్దతుగా గ్రామస్తులు, యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు.పహల్గాం లో ఉగ్రవాదుల దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధురు పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లో వైమానిక దాడులు చేసి ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. జై జవాన్ భారత్ మాతాకీ జై అంటూ నినదించారు. జాతీయ జెండాలు చేతబట్టి కొవ్వొత్తులతో గ్రామంలో ర్యాలీ తీశారు.