కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పురిటినొప్పులతో గర్భిణీ స్త్రీ చికిత్స పొందుతూ మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన ఎమ్మిగనూరు లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ వద్ద జరిగింది. మంత్రాలయం మండలం శివగురుకు చెందిన కురువ లింగమ్మ పురునెప్పులు రాగా ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కు తీసుకువచ్చారు. ఎంతసేపటికి గర్భిణీ స్త్రీ ప్రసవం కాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించడంతో ఆదోని ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ మృతి చెందడంతో ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ వద్ద కుటుంబ సభ్యులు న్యాయం కోసం ఆందోళనకు దిగారు.