ఎల్లారెడ్డి మండలం శబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల రామచందర్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన చిన్నమ్మ మరణించడంతో భార్యతో కలిసి దినకర్మకై వెళ్లారు. బత్తుల లక్ష్మయ్య సావిత్రి ఇంటికి వెళ్లి టీవీ చూస్తుండగా కరెంటు వెళ్లి వచ్చింది, టీవీ ఆన్ చేయమని పిలిచిన పలకకపోవడంతో చూసేసరికి ఉరివేసుకొని చనిపోయి ఉంది. సావిత్రి బెడ్ రూమ్ లో ఓ పుస్తకంలో ఇలా రాసి ఉంది. ప్రదీప్ అనే యువకుడితో ప్రేమ ఉందని, తను ప్రేమ పేరుతో మోసం చేశాడని రాసి ఉంది. తండ్రి రామచందర్ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.