వేటపాలెం- చిన్నగంజాం స్టేషన్ల మధ్య రైలు పట్టాల పక్కన శుక్రవారం సాయంత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండగా గ్యాంగ్ మెన్ గుర్తించి చీరాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే రైల్వే ఎస్సై కొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అతను రైల్లో ప్రయాణిస్తూ నిద్ర మత్తులో భోగి నుండి జారిపడి మరణించి ఉంటాడని ఎస్సై చెప్పారు.కేసు విచారణలో ఉంది.