కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్ద దుమారం రేగింది. గత నెల 29న సోమప్ప సర్కిల్ వద్ద వినాయక విగ్రహాల ఊరేగింపు జరుగుతుండగా, సీఐ శ్రీనివాసులు మైకు తీసుకొని హిందువులను అవమానిస్తూ తిట్టారు. అదే రోజు రాత్రి ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని విచక్షణా రహితంగా కొట్టారు. 31న సోగనూరు రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వినాయకుడు ఊరేగింపులో ఆటో డ్రైవర్‌ను బూటు కాళ్లతో తన్నడంతో గాయపరిచారు. ఈ ఘటనలపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది.“సీఐ శ్రీనివాసులపై సుమోటో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్..