రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆరోపించారు. ఆదివారం బాపట్ల వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపుమేరకు ఈ నెల 9వ తేదీన ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ప్రకటించారు. అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.