ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో ముగ్గురు యువకులకు గాయాలు..సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ సమీపానికి చెందిన ముగ్గురు యువకులు పాల్వంచలో మద్యం సేవించి,మొగల్ బిర్యానీ తిని తిరుగు ప్రయాణం చేస్తుండగా పట్టణ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నారు.ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు..విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు..