మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు పెడతామని ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం రాత్రి ఆయన ఒంగోలు చర్చి సెంటర్ లో వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రధానంగా మైనర్ల పై ఫోకస్ పెట్టారు. ఏ క్రమంలో వాహనాలు నడుపుతున్న మైనర్లను ఆయన నిలుపు చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలు నడిపే మైనర్లు చేసే ప్రమాదాలకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. దురదృష్టకర సంఘటన జరిగితే బాధపడాల్సింది తల్లిదండ్రులు లేనని ఆయన ఉద్భోదించారు.