పెన్ పహాడ్ మండలంలోని దుబ్బ తండాలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పర్యటించారు. ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుతీస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.