తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని కరీంనగర్ లో అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారుల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీకి రక్తంతో ఆదివారంలేఖ రాశారు.ఉద్యమకారుల జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం అనేకమంది బలిదానాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధుల లాగా గుర్తిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా హామీని మరిచి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడంలేదని అన్నారు. వెంటనే తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధుల లాగా గుర్తించి, ఇచ్చిన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు.