అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని కాలువపల్లి గ్రామ రైతు సేవ కేంద్రం నందు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉద్యాన పంటల్లో సీజనల్ వారిగా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు సస్యరక్షణ చీడపీడల నివారణ పై శిక్షణ కార్యక్రమాన్ని కళ్యాణ్ దుర్గం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త యుగంధర్ ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ మండల అధికారి కృష్ణ తేజ అధ్యక్షతన రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 -26ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన శాఖ సంబంధించిన సబ్సిడీ పథకాలపైన, ఎస్సీ ఎస్టీ రైతులకు మొదటి ప్రాధాన్యతగా అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉద్యాన పంటలను పరిశీలించారు.