సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి పర్యటించి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు ముందుగా తొగుట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఓ పి రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. ఈరోజు 30 కి పైగా ఓపి ఉన్నారని రోజు ఆసుపత్రికి పేషంట్ లు తాకిడి బాగా ఉంటుందని మెడికల్ ఆఫీసర్ రాధా కృష్ణ కలెక్టర్ కి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సీజనల్ వ్యాధులకు సంబంధించి చికిత్స తో పాటు ఇంటిలో దోమలు ఉండకుండా జాగ్రత్త చర్యలు తెలపాలని సూచించారు.