ఈనెల 15న కామారెడ్డిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవ సభను అడ్డుకుంటామని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం హుస్నాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏలోకి మారుస్తానని ఇచ్చిన మాట ను మర్చిపోయాడన్నారు. ముదిరాజులకు ఇచ్చిన హామీలను మర్చిపోతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉందన్నారు. కామారెడ్డి విజయోత్సవ సభకు ముందుగానే ముదిరాజుల ప్రకటన వెలబడాలన్నారు. లేకుంట