పెద్దపంజాణి: గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు, గుండ్లపల్లి గ్రామానికి చెందిన మనీ భార్య చిన్న పాపమ్మ సమీపంలో ఉన్న భావి వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయింది. గమనించిన స్థానికులు బావి వద్దకు వెళ్లి కాపాడే లోపు అప్పటికే ప్రాణం పోయిందని తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై ధనుంజయ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకొని, చిన్న పాపమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.