నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం, పసునూరు గ్రామంలోని పెద్ద చెరువు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ కౌలు రైతు సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం ఆదివారం మధ్యాహ్నం రోడ్లను పరిశీలించి, వాగు దాటడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. బ్రిడ్జి నిర్మాణం వందలాదిమందికి ఉపయోగపడుతుందని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా యూరియాను రైతులకు అందుబాటులోకి తేవాలని, సెప్టెంబర్ 1న నాంపల్లి తాహాసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.