ఎన్నికల హామీలు ఇచ్చిన మాట మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షర్లకు సంబంధించిన ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి ఉరవకొండలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే నాలుగు డీఏలను విడుదల చేయాలని పిఆర్సి కమిషన్ నియమించాలని యాప్ ల పని భారం తగ్గించాలని బదిలీ పొంది రిలీవ్ కానీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలన్న అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు నారాయణస్వామి, ex రాష్ట్ర కౌన్సిలర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నార.