గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న తలపెట్టిన చలో హైదరాబాద్ను జయప్రదం చేయాలని ఆదర్శ గ్రామపంచాయతీ రాష్ట్ర అధ్యక్షుడు దాసు పిలుపునిచ్చారు. మెండోరాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు