కనిగిరి పట్టణంలో ఆవులకు రక్షణ లేకుండా పోయింది. ఆవుల యజమానులు పట్టించుకోకుండా రోడ్లపై వదిలేస్తుండడంతో అవి దొంగల పాలవుతున్నాయి. ఆదివారం పట్టణంలో అక్రమంగా మినీ ట్రక్కులో కొందరు రోడ్డుపై నిద్రిస్తున్న ఆవును తరలిస్తుండగా స్థానికులు గమనించి, విషయాన్ని ఆవు యజమానికి తెలిపారు. ఆవు యజమాని అక్కడికి చేరుకొని, ట్రక్కులు అక్రమంగా తరలిస్తున్న ఆవులు విడిపించి , స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.