నడిగూడెం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు నడిగూడెంలో వేకు జాము నుండే రైతులు పడి కాపులు కాచారు. కార్యాలయం ముందు బారులు తీరి కిలోమీటర్ మేర చెప్పులను క్యూ లైన్ లో పెట్టారు. అయితే వేకువ జాము నుండి వేచి ఉన్న యూరియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. తమకు వెంటనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు పహారాల మధ్య నిర్వాహకులు యూరియా రైతులకు పంపిణీ చేశారు.