సూర్యలంక బీచ్ లో జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర తీరం ఇసుకలో రాళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.బాపట్ల నుంచి సూర్యలంక బీచ్‌కు వచ్చే రహదారికి ఇరువైపులా ఉన్న చిల్లకంప చెట్లను తొలగించాలన్నారు.యంత్రాలతో వేగంగా జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.