కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం మరియు రూరల్ ప్రాంతంలో, సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయం నుండి సుమారు రెండు గంటలు సేపు కుండపోతగా కురిసిన వర్షంతో, ప్రధాన రహదారులు జలమయ్యాయి.. దీనికి తోడు రోడ్లపై ఉన్న పెద్ద పెద్ద గుంతలు, వర్షపు నీటితో నిండి ఉండడంతో. రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. ఏది రోడ్డు ఏది గుంత అనే విషయం, తెలియనంతగా వర్షపు నీరు రోడ్డుపై ఉంది, దీంతో ప్రయాణికులు ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందులకు గురయ్యారు. సుమారు గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.