పామూరు: రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పామూరు మండల అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి విమర్శించారు. సోమవారం పామూరు వైసిపి కార్యాలయంలో ఈనెల 9న కనిగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించు అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హుస్సేన్ రెడ్డి ఆవిష్కరించారు. రైతులకు కనీసం ఎరువులను కూడా సరఫరా చేయలేని దీనస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం వైసిపి పోరాడుతుందన్నారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.