ఎమ్మిగనూరు : 'చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి'5 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చేనేత కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైసీపీ చేనేత జిల్లా అధ్యక్షుడు శివ పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి మగ్గాలు దెబ్బతిన్న ప్రాంతాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. శివ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. నిత్యం మగ్గం నేస్తే తప్ప పొట్టనిండని చేనేత కార్మికుల దీనస్థితిపై ప్రభుత్వం స్పందించి అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.